Advertisement

  • కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల మంది మృతి ..భారత్ లో నలబై వేలు దాటిన మరణాలు

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల మంది మృతి ..భారత్ లో నలబై వేలు దాటిన మరణాలు

By: Sankar Thu, 06 Aug 2020 10:33 AM

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల మంది మృతి ..భారత్ లో నలబై వేలు దాటిన మరణాలు



భారత్‌లో కరోనా వైరస్‌ అంతకంతకూ విసర్తిస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 56,282 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే(బుధవారం) అత్యధికంగా 904 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దీని ప్రకారం దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. మొత్తం 40,699 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,95,501 యాక్టివ్‌ కేసులు ఉండగా, 13,28,337 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక బుధవారం 6,64,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 2,21,49,351 టెస్టులు పూర్తి చేశారు..

ఇక మరోవైపు బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విజృంభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో పాటు మరణాల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 28,59,073కు చేరగా.. 97,256 మంది మృత్యువాతపడ్డారని ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,154 మంది మృతి చెందారని పేర్కొంది.

ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నది బ్రెజిల్‌లోనే. అమెరికాలో ఇప్పటివరకు 49లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18.6 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారు. కాగా కరోనా కారణంగా ఇప్పటివరకు 7లక్షలకు పైగా మృతి చెందారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత జాన్స్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.


Tags :
|
|
|
|

Advertisement