Advertisement

  • తెలంగాణాలో కనికరం చూయించని కరోనా ..తాజాగా 1879 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణాలో కనికరం చూయించని కరోనా ..తాజాగా 1879 పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Wed, 08 July 2020 06:08 AM

తెలంగాణాలో కనికరం చూయించని కరోనా ..తాజాగా 1879 పాజిటివ్ కేసులు నమోదు



తెలంగాణాలో కరోనా ఏ మాత్రం కూడా కనికరం చూయించడం లేదు ..గత పది రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఉన్న కరోనా గత 24 గంటల్లో కూడా అదే స్థాయిలో విజృంభించింది .. తాజాగా మరో 1,879 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 27,612కి చేరింది. ఇందులో 11,012 మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 16,287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఏడుగురు మృతిచెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 313కి పెరిగింది.

అయితే ఎక్కువగా పాజిటివ్ కేసులు ఇప్పటికి కూడా హైదరాబాద్ పరిధిలోనే నమోదు అవుతున్నప్పటికీ ..కరోనా మెల్ల మెల్లగా అన్ని జిల్లాలకు పాకుతుంది ..తాజాగ నమోదు అయినా కేసులలో హైదరాబాద్ కాకుండా మరో 26 జిలాల్లో కేసులు నమోదు అవడం ఆందోళన కలిగిస్తుంది ..పరిస్థితి ఇలాగె ఉంటె అన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు తీవ్రం అయ్యే అవకాశం ఉంది ..

కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,422 ఉండగా.. రంగారెడ్డిలో 176, మేడ్చల్‌లో 94, కరీంనగర్‌లో 32, నల్లగొండలో 31, నిజామాబాద్‌లో 19, వరంగల్‌ అర్బన్‌లో 13, మహబూబ్‌నగర్‌లో 11, మెదక్, ములుగు లో 12 చొప్పున, సంగారెడ్డి, సూర్యాపేటలో 9 చొప్పున, కామారెడ్డిలో 7, భూపాలపల్లిలో 6, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెంలో 3 చొప్పున, జగిత్యాల, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 2 చొప్పున, వికారాబాద్, ఆదిలాబాద్, జనగామ, వనపర్తి, సిద్దిపేట్‌ జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 6,220 మందికి పరీక్షలు నిర్వహించగా 4,341 మందికి నెగెటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,438 మందికి పరీక్షలు నిర్వహించగా.. 1,00,826 మందికి నెగి టివ్‌ వచ్చినట్లు వెద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :
|
|
|
|
|

Advertisement