Advertisement

కేంద్ర పాలిత ప్రాంతం యానాం లో టోర్నడో

By: chandrasekar Sat, 18 July 2020 8:40 PM

కేంద్ర పాలిత  ప్రాంతం యానాం లో టోర్నడో


అమెరికాలో నిత్యం ఎక్కడో ఓ చోట టోర్నడోలు సుడులు తిరుగుతూ విధ్వంసం సృష్టించే విషయం తెలిసిందే. ఆ స్థాయిలో కాకపోయినా భారత్ లో ఇటీవలి కాలంలో టోర్నడోలు తరచూ ఏర్పడుతున్నాయి.

ఇప్పుడు యానాం ప్రాంతంలో టోర్నడో దృశ్యం దర్శనమిచ్చింది. ఇక్కడి అయ్యనార్ నగర్ లో ఉన్న ఓ రొయ్యల చెరువులోని నీరు అకస్మాత్తుగా ఆకాశానికెగసింది. వేగంగా సుడులు తిరుగుతూ మేఘాల్లోకి నీరు వెళ్లడాన్ని స్థానికులు విస్మయంతో తిలకించారు.ఈ ప్రాంతంలో టోర్నడోలు గతంలో ఎప్పుడూ ఏర్పడకపోవడంతో చాలామంది తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.

అయితే వాతావరణలో మార్పుల కారణంగా ఈ టోర్నడోలు ఏర్పడుతుంటాయని, అయితే యానాం ప్రాంతంలో మాత్రం గతంలో ఎప్పుడూ టోర్నడోలు కనిపించిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు.

Tags :

Advertisement