Advertisement

  • 2022 కామన్వెల్త్ మహిళల‌ క్రికెట్‌కు టాప్‌-6 జట్లు

2022 కామన్వెల్త్ మహిళల‌ క్రికెట్‌కు టాప్‌-6 జట్లు

By: chandrasekar Thu, 19 Nov 2020 2:53 PM

2022 కామన్వెల్త్ మహిళల‌ క్రికెట్‌కు టాప్‌-6 జట్లు


2022 కామన్వెల్త్‌ క్రీడలకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరుస్థానాల్లో ఉండే మహిళల క్రికెట్‌ జట్లు అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య దేశ హోదాలో ఇంగ్లండ్‌ నేరుగా క్వాలిఫై కానుండగా అర్హత టోర్నీలో గెలిచే మరో జట్టు కూడా చోటు దక్కించుకోనుంది.

బుధవారం దీనికి సంబంధించిన అర్హత ప్రక్రియను ఐసీసీ, కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య విడుదల చేశాయి. 1998 కౌలాలంపూర్‌ కామన్వెల్త్‌లో పురుషుల పోటీలు జరుగగా ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్‌ భాగం కావడం ఇది రెండోసారి.

ప్రస్తుతం భారత మహిళల జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉంది. ‘ఎనిమిది జట్లు పోటీ పడే కామన్వెల్త్‌ క్రికెట్‌ టోర్నీకి ఇంగ్లండ్‌తో పాటు తొలి ఆరు ర్యాంకుల్లో ఉండే జట్లు అర్హత సాధిస్తాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో టోర్నీ జరుగుతుంది.

మహిళల క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు కామన్వెల్త్‌ క్రీడలు గొప్ప అవకాశం’ అని ఐసీసీ ప్రకటించింది.

Tags :
|

Advertisement