Advertisement

టమాట ధరకు రెక్కలు ..కిలో యాబై రూపాయలు

By: Sankar Tue, 25 Aug 2020 2:58 PM

టమాట ధరకు రెక్కలు ..కిలో యాబై రూపాయలు


నిన్నమొన్నటివరకు తగ్గినట్లే తగ్గిన టమాటా మరోసారి పెరిగిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర మళ్లీ మోతెక్కిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకు కిలో రూ. 30 పలికిన ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర రూ. 50 వరకు పలుకుతోంది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. వారం క్రితం వరకు గ్రేడ్‌–1 టమాటా కిలో అత్యధికంగా రూ.20 ధర పలకగా.. ఇప్పుడు అమాంతం రూ.50కి పెరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం.. కాయల్లో నాణ్యత తగ్గిపోవడం.. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగాయి. దీంతో అసలే లాక్‌డౌన్ దెబ్బతో జీతాలు సరిగా రాక ఇబ్బందులో ఉన్నప్పుడు ఇంత భారీగా ధరలు పెరగడం మింగుడుపనివ్వడం లేదు. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురిశాయి. దీంతో టమాటా పంట బాగా దెబ్బతినడంతో సరఫరా తగ్గిపోయింది. తెగులు కూడా ఎక్కువ కావడంతో దిగుబడి కూడా తగ్గిపోయింది. ఫలితంగా మార్కెట్లకు పంట సరిగా రావడం లేదు. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు వరదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో టమాటా పంట దెబ్బతింది.

Tags :
|
|
|

Advertisement