Advertisement

  • వరల్డ్‌ టీ20 ఎలెవన్ జట్టు‌ని సెలెక్ట్ చేసిన టామ్ మూడీ

వరల్డ్‌ టీ20 ఎలెవన్ జట్టు‌ని సెలెక్ట్ చేసిన టామ్ మూడీ

By: chandrasekar Mon, 13 July 2020 2:59 PM

వరల్డ్‌ టీ20 ఎలెవన్ జట్టు‌ని సెలెక్ట్ చేసిన టామ్ మూడీ


వరల్డ్‌ టీ20 ఎలెవన్ జట్టుకి భారత ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపిక చేసారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి హెడ్ కోచ్‌గా పనిచేసిన టామ్ మూడీని క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ప్రస్తుత తరం క్రికెటర్లతో ఒక వరల్డ్ టీ20 జట్టుని ప్రకటించమని కోరాడు.

దాంతో టీమ్‌ని సెలెక్ట్ చేసిన టామ్ మూడీ రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఎంపిక చేయడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించాడు. ధోనీకి ఈ జట్టులో చోటు దక్కలేదు.

టామ్ మూడీ వరల్డ్‌ టీ20 ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్, (12వ ఆటగాడు) రవీంద్ర జడేజా.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసిన టామ్ మూడీ. కుడి, ఎడమ కాంబినేషన్ కోసమే వారిని సెలెక్ట్ చేసినట్లు వివరించాడు. నెం.3లో విరాట్ కోహ్లీ, నెం.4లో ఏబీ డివిలియర్స్‌‌కి అవకాశమిచ్చిన టామ్ మూడీ.. నెం.5లో తొలుత ఇంగ్లాండ్ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ని ఎంపిక చేయాలని భావించాడు. కానీ మిడిలార్డర్‌లో లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కావాలని ఆశించి అతని స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ని సెలక్ట్ చేశాడు.

నెం.6లో ఆల్‌రౌండర్‌గా ఆండ్రీ రసెల్‌ని ఎంపిక చేసిన టామ్ మూడీ. ఆ తర్వాత రషీద్ ఖాన్, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకి జట్టులో చోటిచ్చాడు. ఇక మిచెల్ స్టార్క్, జస్‌ప్రీత్ బుమ్రా, జోప్రా ఆర్చర్ రూపంలో ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసిన టామ్ మూడీ 12వ ఆటగాడిగా రవీంద్ర జడేజాని ఎంపిక చేశాడు. ఫీల్డింగ్ కోసమే జడేజాని అలా సెలక్ట్ చేసినట్లు మూడీ వివరించాడు.

Tags :
|
|

Advertisement