Advertisement

  • ఇండియన్ టీంలో కెప్టెన్సీ విభజన అంత సులభం కాదు ..టామ్ మూడీ

ఇండియన్ టీంలో కెప్టెన్సీ విభజన అంత సులభం కాదు ..టామ్ మూడీ

By: Sankar Fri, 10 July 2020 7:25 PM

ఇండియన్ టీంలో కెప్టెన్సీ విభజన అంత సులభం కాదు ..టామ్ మూడీ



ఇండియన్ క్రికెట్ లో కెప్టెన్సీ విభజనపై ఈ మధ్య కాలంలో బాగా వార్తలు వస్తున్నాయి ..ధోని కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు కెప్టెన్సీ గురించి ఎటువంటి ఢోకా లేకపోయింది ..అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొని కోహ్లీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత మూడు ఫార్మటు లలో కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ..అయితే ఇండియా కోహ్లీ కెప్టెన్సీ లో విజయాలు సాదిస్తున్నప్పటికీ కీలక మ్యాచ్ లలో మాత్రం తడబడుతుంది ..టెస్ట్ క్రికెట్ వరకు కోహ్లీ కెప్టెన్సీ కి ఎటువంటి ఢోకా లేకపోయినప్పటికీ వన్ డే , టి ట్వంటీ క్రికెట్ లో కోహ్లీ కెప్టెన్సీ మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ..

కోహ్లీ కెప్టెన్ అయ్యాక ఇంతవరకు టీమిండియా ఒక్క మేజర్ టోర్నీ కూడా లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో గెలవలేదు ..అయితే కోహ్లీ కెప్టెన్సీలోని ఐపీయల్ రాయల్ చాలెంజర్స్ టీంకుడా ఒక్క టైటిల్ కూడా గెలవలేదు ..అయితే మరోవైపు కెప్టెన్సీలో కోహ్లీకి ప్రధాన పోటీ అయిన రోహిత్ శర్మ ఐపీయల్ లో నాలుగు ఐపియల్ టైటిల్ లతో ప్రథమ స్థానం లో ఉన్నాడు ..మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్ లలో కూడా తనకు వచ్చిన అవకాశాలను రోహిత్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు ..దీనితో కెప్టెన్సీ చేంజ్ విషయమై అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ..

అయితే ఇదే విషయమై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ స్పందించాడు ..ఇంగ్లాండ్‌లో కెప్టెన్సీ విభజన సులువుగా జరగడానికి కారణం.. ఇయాన్ మోర్గాన్ టెస్టు ప్లేయర్ కాదు. అతను పక్కా టీ20, వన్డే బ్యాట్స్‌మెన్. కానీ.. భారత్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నారు. కాబట్టి.. ఒకవేళ కోహ్లీ నుంచి టీ20 కెప్టెన్సీని తప్పిస్తే..? అతను సుదీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగగలడు. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అంటే ఒత్తిడితో కూడుకున్న అంశం. భారత్‌లో ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది’’ అని టామ్ మూడీ వెల్లడించాడు.

Tags :
|
|

Advertisement