Advertisement

  • టాలీవుడ్ నిర్మాత కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి

టాలీవుడ్ నిర్మాత కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి

By: chandrasekar Wed, 19 Aug 2020 5:38 PM

టాలీవుడ్ నిర్మాత కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి


టాలీవుడ్‌లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్‌లో ఒకరైన నిర్మాత కమలాకర్ రెడ్డి.. ఈయన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇటీవలే కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది... ఆయన వయసు 75 ఏళ్లు. దాంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న కమలాకర్ రెడ్డికి కూడా కరోనా వచ్చింది. నెల్లూరు సమీపంలోని పల్లెటూరిలో ఉంటున్న ఈ ఇద్దరూ కరోనా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వస్తున్నారు. దారి మధ్యలో యాక్సిడెంట్ లో యిద్దరు ప్రాణాలు కోల్పోయారు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో అంబులెన్స్ ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి కూడా అక్కడికక్కడే మృతి చెందారు.. అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యే విడుదలైన కనులు కనులు దోచాయంటే సినిమాను కేఎఫ్‌సి ఎంటర్‌టైన్మెంట్ సంస్థ తెలుగులో విడుదల చేసింది.

Tags :

Advertisement