Advertisement

  • బ్రేకింగ్ న్యూస్ ...మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

బ్రేకింగ్ న్యూస్ ...మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

By: Sankar Mon, 09 Nov 2020 1:21 PM

బ్రేకింగ్ న్యూస్ ...మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు. వారు వీరి అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు.

''ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను'' అని ట్విట్ చేసారు మెగాస్టార్.

అయితే‌ కరోనా కారణంగా వాయిదా పడిన ఆచార్య షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Tags :
|

Advertisement