Advertisement

  • నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ Vs బెంగళూరు...అస్త్రశస్త్రాలు ఎంచుకున్నా వార్నర్‌ సేన

నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ Vs బెంగళూరు...అస్త్రశస్త్రాలు ఎంచుకున్నా వార్నర్‌ సేన

By: chandrasekar Sat, 31 Oct 2020 1:31 PM

నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ Vs బెంగళూరు...అస్త్రశస్త్రాలు ఎంచుకున్నా వార్నర్‌ సేన


సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రోజు జరిగే మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సిన అవసరం ఉంది.

శనివారం బెంగళూరుతో తలపడేందుకు వార్నర్‌ సేన అస్త్రశస్త్రాలు ఎంచుకుంది.

గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్‌ అదే జోరులో బెంగళూరుపై కూడా నెగ్గి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని యోచిస్తున్నది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌.. ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలువగా.. చెన్నై మాత్రమే అధికారికంగా రేసు నుంచి తప్పుకుంది.

మరొక్క విజయం సాధిస్తే.. బెంగళూరు కూడా బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఈ స్థితిలో కోహ్లీ సేన విజయంపై కన్నేసింది.

హైదరాబాద్‌కు కూడా ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశాలున్నా.. ఉన్న రెండు మ్యాచ్‌లు తప్పక నెగ్గడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా వార్నర్‌ సేనకు అనుకూలంగా రావాల్సి ఉంది.

లీగ్‌దశలో మెరుగైన రన్‌రేట్‌ ఉండటం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం.

Tags :
|

Advertisement