Advertisement

నేడు పంజాబ్ Vs రాజస్థాన్...

By: chandrasekar Fri, 30 Oct 2020 1:50 PM

నేడు పంజాబ్ vs రాజస్థాన్...


ఐపీఎల్ 2020 లీగ్ లో ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లేఆఫ్ చేరగా.. బెంగళూరు, ఢిల్లీ జట్లు కూడా ప్లేఆఫ్ చేరడం తేలికే. ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. చెన్నై చేతిలో ఓడిన కోల్‌కతా చివరి మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. కానీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆ జట్టు ప్లేఆఫ్ చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక ప్లేఆఫ్ రేసులో ముందంజలో ఉన్న మరో జట్టు కింగ్స్ ఎలవెన్ పంజాబ్. వరుస విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్.. నేడు (అక్టోబర్ 30) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే.. 14 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్‌కు మరింత చేరువ అవుతుంది. మరోవైపు రాజస్థాన్‌కు కూడా ప్లేఆఫ్ చేరే అవకాశాలు మ్యాథమెటికల్‌గా మిగిలే ఉన్నాయి. చివరి మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచి పంజాబ్, సన్‌రైజర్స్, కోల్‌కతా ఓడితే.. రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరొచ్చు.

పంజాబ్‌పై రాజస్థాన్ విజయం సాధిస్తే.. ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడంతోపాటు.. సన్‌రైజర్స్‌కు సైతం కలిసొస్తుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడితే.. రాహుల్ సేన గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. సన్‌రైజర్స్ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభంలో ఇరు జట్లు తలపడగా... ఆ మ్యాచ్‌లో పంజాబ్ 223 రన్స్ చేసినప్పటికీ.. రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్ తెవాతియా ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాది రాజస్థాన్‌ను గెలిపించాడు. సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైన పంజాబ్.. ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది.. ప్లేఆఫ్ రేసులోకి బలంగా దూసుకొచ్చింది. మరోవైపు రాజస్థాన్ ఓ మ్యాచ్ గెలిస్తే.. రెండు మ్యాచ్‌లు ఓడుతూ... ప్లేఆఫ్ రేసులో వెనుకబడింది.

పంజాబ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. రాహుల్, మన్‌దీప్ సింగ్, గేల్, పూరన్ బ్యాటింగ్‌లో కీలకంగా మారగా.. షమీ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ అజేయ శతకం బాదగా.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేయడం రాజస్థాన్‌కు ఊరటనిస్తోంది. బౌలింగ్‌లో ప్రధానంగా జోఫ్రా ఆర్చర్‌పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.

Tags :
|
|
|

Advertisement