Advertisement

నేడే CSK Vs SRH ...

By: chandrasekar Fri, 02 Oct 2020 7:14 PM

నేడే  CSK vs SRH ...


IPL-2020లో భాగంగా కీలక పోరు ప్రారంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తలపడనుంది.

ఐపీఎల్ 2020లో ఈ రెండు జట్ల ప్రదర్శన ఆశాజనకంగా కనిపించడం లేదు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య సాగే సమరంపై అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో మరో ఆసక్తికరమైన పోరు మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. ఇప్పటివరకు ఈ రెండు బలమైన జట్లు 12 సార్లు తలపడగా అందులో తొమ్మిది సార్లు చెన్నై సూపర్ కింగ్స్,మూడుసార్లు మాత్రమే హైదరాబాద్ గెలిచింది.

ఇక చివరి అయిదు మ్యాచులు చూసుకుంటే వాటిలో నాలుగింటిని చెన్నై గెలవగా. సన్ రైజర్స్. ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఢిల్లీపై గెలిచి మంచి ఊపును మీద ఉన్న వార్నర్ సేన చెన్నైపై ఎలాంటి వ్యూహాలతో రంగంలోకి దిగబోతోందో వేచి చూడాలి.

Tags :
|
|

Advertisement