Advertisement

  • ఏపీలోని ఆ జిల్లాలో నేడు సంపూర్ణ లాక్ డౌన్ ..ఎందుకో తెలుసా !

ఏపీలోని ఆ జిల్లాలో నేడు సంపూర్ణ లాక్ డౌన్ ..ఎందుకో తెలుసా !

By: Sankar Sun, 11 Oct 2020 07:51 AM

ఏపీలోని ఆ జిల్లాలో నేడు సంపూర్ణ లాక్ డౌన్ ..ఎందుకో తెలుసా !


కరోనా వ్యాప్తి నేపథ్యంలో శ్రీకాకుళంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు అధికారులు... జిల్లాతో పాటు.. శ్రీకాకుళం టౌన్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధించినట్టు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్‌డౌన్ రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.

ఈ సమయంలో మెడికల్‌ షాపులు, వైద్య సేవలు మినహా ఇతర ఏ షాపులు తెరవొద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ప్రధాన మార్గాలు, జంక్షన్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.. కాగా, ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది... రోజువారి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి.. రికవరీ కేసులు పెరుగుతున్నాయి...

తాజా బులెటిన్‌లో శ్రీకాకుళం జిల్లాలో 163 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆ కేసుల సంఖ్య 41,486కు చేరింది.. ప్రస్తుతం జిల్లాలో 1818 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 329 మంది మృతిచెందారు.. ఇక, ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,50,517కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement