Advertisement

  • ఆస్ట్రేలియా చేసిన భారీ స్కోర్ కి... భారత్ ఓడిపోవడానికి గల కారణాలు...

ఆస్ట్రేలియా చేసిన భారీ స్కోర్ కి... భారత్ ఓడిపోవడానికి గల కారణాలు...

By: chandrasekar Sat, 28 Nov 2020 3:10 PM

ఆస్ట్రేలియా చేసిన భారీ స్కోర్ కి... భారత్ ఓడిపోవడానికి గల కారణాలు...


భారత్ క్రికెట్ టీం ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి వన్ డే మ్యాచ్ లో ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 66 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవి చూసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ తొలి వికెట్‌కు ఏకంగా 156 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఈ జోడిని విడదీయడానికి కోహ్లి చేసిన ప్రయత్నాలేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. చివరకు షమీ బౌలింగ్‌లో వార్నర్ ఔటయ్యాక భారత్ ఊపిరి పీల్చుకుంది. వార్నర్, ఫించ్ మెల్లగా ఆడినా తర్వాత వచ్చిన స్మిత్ (66 బంతుల్లో 105), మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడారు. వీరిద్దర్నీ కట్టడి చేయలేక భారత బౌలర్లు చేతులెత్తేశారు. స్పిన్నర్ చాహల్ అయితే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 10 ఓవర్లలో 89 పరుగులిచ్చి ఒకే వికెట్ పడగొట్టాడు. ఇతని బౌలింగ్ చాలా పేలవంగా ఉనింది.

మన టీంలో పార్ట్ టైం బౌలర్ లేకపోవడం వల్ల ఐదు బౌలర్లతో బరిలో దిగిన భారత్‌కు జట్టులో మరో ఆల్‌రౌండర్ లేని లోటు కనిపించింది. పాండ్య ఆడినప్పటికీ ఫిట్‌నెస్ కారణాలతో అతడు బౌలింగ్ చేయలేదు. వారి టాప్ ఆర్డర్ దూకుడుగా బాటింగ్ చేయడం వల్ల దీంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎంత దూకుడుగా ఆడినప్పటికీ అదనపు బౌలర్ లేకపోవడంతో ఉన్న ఐదుగురితోనే కోహ్లి మార్చి మార్చి బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. జట్టులో పార్ట్‌టైం బౌలర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో భారత ఫీల్డింగ్ పేలవంగా ఉంది. సింగిల్స్ రావాల్సిన చోట ఫోర్లు, సిక్సులొచ్చాయి. ధావన్, పాండ్య లాంటి ఫీల్డర్లు సైతం క్యాచ్‌లను జారవిడిచారు. ఫించ్‌ను రనౌట్ చేసే ఛాన్స్‌ను జడేజా మిస్ చేశాడు. ఫీల్డింగ్ తప్పిదాలతో భారత్ కనీసం 50 పరుగులు అదనంగా ఇచ్చుకుంది. ఇక బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలం భారత్‌ను దెబ్బ తీసింది. మయాంక్, ధావన్ దూకుడుగానే బ్యాటింగ్ ఆరంభించినప్పటికీ వికెట్‌ను కాపాడుకోవడానికి మయాంక్ ప్రాధాన్యం ఇవ్వలేదు.

వికెట్ లపై శ్రద్ధ వహించకుండా దీంతో మంచి ఊపు మీదున్న సమయంలో తొలి వికెట్ పోగొట్టుకున్న భారత్ కాసేపటికే కీలకమైన కోహ్లి వికెట్‌ను పోగొట్టుకుంది. షార్ట్ పిచ్ బాల్స్‌ను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సైతం త్వరగా ఔటయ్యారు. పార్ట్ టైం వికెట్ కీపర్ అయిన రాహుల్ 50 ఓవర్లపాటు వికెట్ కీపింగ్ చేసి అలసిపోయాడు. తిరిగి పది ఓవర్లు ముగిసే లోపే మళ్లీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. రాహుల్ కంటే ముందు పాండ్య లేదా జడేజాను పంపించే ఉంటే బాగుండేదనే భావన వ్యక్తం అవుతోంది. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడం స్పిన్నర్ చాహల్ తేలిపోవడం ఫీల్డర్ల తప్పిదాలు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం ఇలా అన్నీ కలిసి భారత ఓటమికి దారి తీశాయి. జట్టులో ఆల్‌రౌండర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. రెండో వన్డేలో సైనీ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.

Tags :

Advertisement