Advertisement

  • కోవిడ్ వాక్సిన్ వేయించుకోనున్న జో బైడెన్‌కు...

కోవిడ్ వాక్సిన్ వేయించుకోనున్న జో బైడెన్‌కు...

By: chandrasekar Fri, 18 Dec 2020 3:44 PM

కోవిడ్ వాక్సిన్ వేయించుకోనున్న జో బైడెన్‌కు...


అమెరికాలో టీకా పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. కరోనా టీకా వినియోగానికి ఎఫ్‌డీఐ ఆమోదం తెలిపిన దరిమిలా అమెరికా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఇదిలాఉండగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు వచ్చే వారం కరోనా టీకా తీసుకోనున్నారని అధ్యక్ష పదవి అధికార మార్పిడీ యంత్రాంగం ప్రకటించింది. అయితే, జో బైడెన్ టీకా వేసుకునే కార్యక్రమం అందరికీ తెలిసేలా జరుగుతుందని ప్రకటించారు.

అమెరికా మొత్తం కరోనా టీకాను వీలైనంత త్వరగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే, అమెరికా పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన సతీమణి కారెన్ ఈ శుక్రవారం నాడు కరోనా టీకాను వేయించుకోనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ అధికారులు ధృవీకరించాయి.

Tags :

Advertisement