Advertisement

  • నిజాయితీగా చెబుతున్నా.. చాన్సే లేదు: స్టీవ్‌ స్మిత్

నిజాయితీగా చెబుతున్నా.. చాన్సే లేదు: స్టీవ్‌ స్మిత్

By: chandrasekar Sat, 31 Oct 2020 1:29 PM

నిజాయితీగా చెబుతున్నా.. చాన్సే లేదు: స్టీవ్‌ స్మిత్


ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్ మరికొంత కాలం బయో బబుల్‌లో ఉండేందుకు ఇష్టపడని కారణంగా ఈ ఏడాది బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) నుంచి తప్పుకున్నాడు.

ఆగస్టు నుంచి బయో సెక్యూర్‌ వాతావరణంలో ఉంటున్న స్మిత్‌తో పాటు వార్నర్‌, కమిన్స్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన స్మిత్‌ ‘నిజాయితీగా చెబుతున్నా.. చాన్సే లేదు’ అని చెప్పాడు.

ఈ ఏడాది చివర్లో టీమ్‌ఇండియా.. ఆసీస్‌లో పర్యటించనుండగా.. దాదాపు అదే సమయం (డిసెంబర్‌ 3 నుంచి 2021 ఫిబ్రవరి 6 వరకు)లో బీబీఎల్‌ పదో సీజన్‌ జరుగనుంది. దీంతో అంతర్జాతీయ స్టార్లు లీగ్‌కు దూరమయ్యే చాన్స్‌లు ఉన్నాయి.

Tags :
|

Advertisement