Advertisement

  • రాష్ట్రంలో వచ్చేఏడాది మే నాటికి తృణమూల్ కాంగ్రెస్ ఉండదు ...వెస్ట్ బెంగాల్ బీజేపీ యూనిట్ చీఫ్ దిలీప్

రాష్ట్రంలో వచ్చేఏడాది మే నాటికి తృణమూల్ కాంగ్రెస్ ఉండదు ...వెస్ట్ బెంగాల్ బీజేపీ యూనిట్ చీఫ్ దిలీప్

By: Sankar Tue, 22 Dec 2020 11:01 AM

రాష్ట్రంలో వచ్చేఏడాది మే నాటికి తృణమూల్ కాంగ్రెస్ ఉండదు ...వెస్ట్ బెంగాల్ బీజేపీ యూనిట్ చీఫ్ దిలీప్


వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి...అయితే ఈ ఎన్నికలలో ఎలాగయినా సత్తా చాటాలని బీజేపీ భావిస్తుంది...కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు..కాగా ఇటీవల భారత జనతా పార్టీ నేత దిలిప్ పశ్చిమ బెంగాళ్‌లో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వచ్చే ఏడాది మే నెల నాటికి త్రుణముళ్ కాంగ్రెస్ కనిపించదని పశ్చిమ బెంగాళ్ బీజేపీ యూనిట్ చీఫ్ దిలీప్ అన్నారు.

ఈ ర్యాలీ పశ్చిమ బెంగాళ్ బార్దామాన్ జిల్లా దార్గాపూర్‌లో జరిగింది. ‘టీఎంసీ కూడా కరోనా లాగానే నన్ను ఏమీ చేయలేదు. కరోనాను పోగొట్టేందుకు వ్యాక్సిన్ ఉంది. వ్యాక్సిన్‌తో కరోనా పోతుంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి టీఎంసీ కూడా వచ్చే ఏడాది మే నెల నాటికి రూపురేఖలు లేకుండా పోతుంద’ని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాళ్‌కు టీఎంసీ కూడా ఒక వైరస్‌ లాంటిదేనని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌తో కలిసి దిలీప్ దార్గాపూర్‌లోని తమ నూతన ఆఫీసును ప్రారంభించారు. అయితే వచ్చే ఏడాది మధ్యాంతంలో పశ్చిమ బెంగాళ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించన తారీకులు ఇంకా ప్రకటించలేదు.

Tags :
|
|
|

Advertisement