Advertisement

  • టిక్ టాక్ పై అనూహ్య మైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్

టిక్ టాక్ పై అనూహ్య మైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్

By: chandrasekar Thu, 02 July 2020 11:52 AM

టిక్ టాక్ పై అనూహ్య మైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్


జూన్ 15వ తేదీ తూర్పు లడ్డాఖ్ లోని గల్వాన్ లోయలో ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, 20 మంది భారత సైనికుల వీరమరణం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్ లను నిషేధించింది. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ ఎంపీగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ పలు నిర్ణయాన్ని సమర్ధించి వార్తలకెక్కిన ఈమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.

టిక్ టాక్ యాప్ నిషేదం కేంద్రం తీసుకున్న తొందరపాటు చర్యగా ఆమె అభివర్ణించారు. చైనా దేశపు టిక్ టాక్ యాప్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. టిక్ టాక్ యాప్ పై నిషేధం ఓ తొందరపాటు చర్యగా అభివర్ణించారు.

కోల్ కత్తా లో జరిగిన శ్రీకృష్ణ రధయాత్రలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. యాప్ నిషేధాన్ని నాటి నోట్ల రద్దుతో పోల్చారు. టిక్‌టాక్ అనేది వినోదాన్ని పంచే ఒక అప్లికేష‌న్‌. ఆ యాప్‌పై నిషేధం విధించడంలో కేంద్రం తొంద‌ర‌ప‌డింది. ఈ నిషేధంవ‌ల్ల దేశంలో జ‌రిగే న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌రున్న వ్యూహాత్మ ప్ర‌ణాళిక ఏమిటి? టిక్‌టాక్‌పై నిషేధం వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారి ప‌రిస్థితి ఏమిటి? ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి ? ఒక‌ప్పుడు నోట్ల ర‌ద్దువ‌ల్ల ఇబ్బందులు ప‌డిన‌ట్లే, ఇప్పుడు టిక్‌టాక్‌పై నిషేధంవ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

దేశ‌భ‌ద్ర‌త‌కు సంబంధించిన విష‌యం కాబ‌ట్టి టిక్‌టాక్‌పై నిషేధంవ‌ల్ల నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. అయితే తాను లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రు స‌మాధానం చెబుతారు అని నుస్ర‌త్ జహాన్ ప్ర‌శ్నించారు. సంస్థ ఉద్యోగులు గర్వించే విధంగా అన్ని సానుకూల అనుభవాలు, అవకాశాల్ని పునరుద్ధరించే విధంగా శక్తిమేరకు అన్నీ చేస్తామంటూ టిక్ టాక్ సీఈఓ ఇండియాలోని టిక్ టాక్ ఉద్యోగులకు లేఖ రాసిన రోజే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Advertisement