Advertisement

తక్కువ ధరలకే తిరుపతి లడ్డులు...

By: chandrasekar Fri, 22 May 2020 6:29 PM

తక్కువ ధరలకే తిరుపతి లడ్డులు...


తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని లాక్ డౌన్ ముగిసే వరకు మూసి ఉంచారు. అయితే తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) యాజమాన్యం శ్రీవారి లడ్డులను భక్తులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. లాక్ డౌన్ ముగిసేవరకు తక్కువ మొత్తానికే లడ్డులను సొంతం చేసుకునే అవకాశాన్ని భక్తులకి కల్పించింది. దాదాపు సగం ధరకే సొంతం చేసుకునేలా అవకాశాన్నిచ్చింది. కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే.

శ్రీవారి లడ్డులను 50 రూపాయలకు విక్రయిస్తుండగా.. లాక్ డౌన్ ముగిసే వరకు 25 రూపాయలకే టీటీడీ అందిస్తుంది. పెద్ద మొత్తంలో లడ్డులను తీసుకునే వారి ఆభ్యర్థనలమేరకు భారీగా లడ్డులను తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రసాదం తయారీ పూర్తయిన తర్వాత దగ్గరలోని టీటీడీ కల్యాణమండపాలు లేదా సమాచార కేంద్రాలకు లడ్డులను రవాణా చేస్తారు.

tirupati,laddu,tirumala,venkateswara swamy,prasadham ,తక్కువ, ధరలకే, తిరుపతి, లడ్డులు, శ్రీవారి


పెద్ద మొత్తంలో లడ్డులు కావాలనుకునే భక్తులు శ్రీవారి దేవాస్థానం డిప్యూటీ ఈవోను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. డిప్యూటీ ఈవో ఫోన్ నెంబర్ 9849575952. ఇది కాకుండా మరో నెంబరుకు 9701092777 కూడా సంప్రదించవచ్చు. అదనపు సమాచారం కోసం లడ్డులను పంపిణీ చేసే టీటీడీ కల్యాణ మండపాల్లో అడిగి తెలిసికోవచ్చు. పెద్ద మొత్తంలో లడ్డులను అభ్యర్థన మేరకు టీటీడీ కల్యాణ మండపాల నుంచి రవాణా చేస్తారు. పూర్తి సమాచారం టీటీడీ సమాచార కేంద్రాల వద్ద తెలుసుకోవచ్చు.

Tags :
|

Advertisement