Advertisement

  • 2020ని రెడ్ క్రాస్ మార్క్ తో కొట్టేసిన టైమ్స్ మ్యాగజిన్

2020ని రెడ్ క్రాస్ మార్క్ తో కొట్టేసిన టైమ్స్ మ్యాగజిన్

By: Sankar Wed, 16 Dec 2020 4:18 PM

2020ని రెడ్ క్రాస్ మార్క్ తో కొట్టేసిన టైమ్స్ మ్యాగజిన్


2020 ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం హడలిపోతుంది ...కరోనా మహమ్మారి దెబ్బకు 2020 లో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయింది..సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖులు అనేకమంది ఈ ఏడాది మరణించారు...

అయితే ఎప్పటి వరకు కరోనా అంతం అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీనికి సంఘీభావంగా టైమ్స్ తన లేటెస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై 2020 అంకెను ప్రచురించి దానిని రెడ్ క్రాస్ మార్క్ తో కొట్టేసింది. ప్రపంచానికి మిగిల్చిన చేదు అనుభవానికి గుర్తుగా ఈ విధంగా చేసినట్టు మ్యాగజైన్ ప్రకటించింది. ఇలా మ్యాగజైన్ పై క్రాస్ మార్క్ తో కొట్టెయ్యడం ఇదే మొదటిసారి కాదు. గతంలో నాలుగుసార్లు ఇలానే చేసింది.

1945 లో హిట్లర్ మృతి చెందినపుడు తొలిసారి టైమ్స్ మ్యాగజిన్ ఇలా కొట్టేసింది ...అదే ఏడాది జపాన్ ఫసిఫిక్ యుద్దాన్ని ఆపడానికి కవర్ పేజీపై క్రాస్ మార్క్ చేసింది. ఆ తరువాత 2003లో సద్దాం హుస్సేన్ మరణించినపుడు, 2006లో మౌసబ్ ఆల్ జర్ క్వానీని అమెరికా దళాలు మట్టుబెట్టినపుడు, 2011లో ఒసామా బీన్ లాడెన్ హతమైనపుడు ఈ విధంగా టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్రాస్ మార్క్ చేసింది

Tags :
|

Advertisement