Advertisement

  • టిక్ టాక్ నిషేధంతో కొత్త మార్గాలను వెతుకుంటున్న టిక్ టాక్ స్టార్స్

టిక్ టాక్ నిషేధంతో కొత్త మార్గాలను వెతుకుంటున్న టిక్ టాక్ స్టార్స్

By: Sankar Tue, 30 June 2020 7:00 PM

టిక్ టాక్ నిషేధంతో కొత్త మార్గాలను వెతుకుంటున్న టిక్ టాక్ స్టార్స్



టిక్ టాక్ ..గత రెండు ఏళ్లలో దేశంలోని యువత మీద ఇది చూయించినంత ప్రభావం మరె ఇతర యాప్ చూయించలేదు అంటే అతిశయోక్తి కాదు ..స్మార్ట్ ఫోన్ యుగంలో యువత తిండి లేకుండా అయినా ఉంటున్నారు గాని టిక్ టాక్ లేకుండా ఉండలేకపోతున్నారు..టిక్ టాక్ వలన ఎందరో యువత ఒక్కసారిగా సెలెబ్రిటీలుగా మారిపోయారు..అయితే ఈ యాప్ వలన ఉపయోగాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి ..

తాజాగా ప్రబుత్వం టిక్ టాక్ యాప్ ను నిషేధించడంతో టిక్‌టాక్ స్టార్లు ప్రస్టేషన్ లో మునిగిపోయారు. ఈ నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుండి, ప్రత్యామ్నాయాలపై వైపు దృష్టిపెట్టారు. ముఖ్యంగా తమ అనుచరులను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఫాలో కావాలని కోరడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోలతో ఇన్‌స్టాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ కు క్రేజ్ క్రమంగా పుంజుకోనుంది.

టిక్‌టాక్ ప్రొఫైల్‌లలో వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలను అందిస్తున్నారు. ఇన్‌స్టా ఎలా ఉపయోగించాలో అభిమానులకు నేర్పుతూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకా చాలామంది టిక్‌టాక్ వినియోగదారులు ఇన్‌స్టా‌ లైవ్ ద్వారా తమని ఫాలో కావాలని, యూట్యూబ్‌లో తమ వీడియోలను చూడమని కోరుతుండటం విశేషం.

అయితే టిక్‌టాక్ యాప్ ను ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతం డౌన్‌లోడ్ చేయలేం. కానీ ఇప్పటికే టిక్ టాక్ యాప్ ఫోన్‌లలో ఉన్న యూజర్లకు దీనికి యాక్సెస్ ఉంది. మరోవైపు టిక్‌టాక్ నిషేధంపై సోషల్ మీడియాలో ఆర్ఐపీ టిక్‌టాక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో వుంది. యూజర్లు మీమ్స్, వీడియోలతో సందడి చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement