Advertisement

టిక్టాక్ కు రాజీనామా: సీఈవో కెవిన్

By: chandrasekar Thu, 27 Aug 2020 8:11 PM

టిక్టాక్ కు రాజీనామా:   సీఈవో కెవిన్


ప్రఖ్యాత వీడియో షేరింగ్ యాప్ అయినటువంటి టిక్‌టాక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కెవిన్ మేయర్ త‌న ప‌ద‌వి నుంచి వైదొలిగినారు. ప్ర‌స్తుత జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలిక సీఈవోగా కొన‌సాగ‌నున్న‌ట్లు కంపెనీ ఉద్యోగుల‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్న‌ట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాపత్రిక గురువారం ప్ర‌చురించింది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల ఆదరణను సొంతం చేసుకున్న టిక్‌టాక్‌కు ఇటీవలి కాలంలో అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను భారీ ఎదురు దెబ్బ తగిలిందికరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంలో చైనా వైఫల్యం, భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం షేధించింది.

ట్రంప్ సర్కార్ కూడా ఇదే బాటలో పయనించింది .అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యాన్ని తేల్చేందుకు ట్రంప్ 90 రోజుల గడువు విధించిన విషయము తెలిసినదే. ఇప్ప‌టికే ప‌లు దేశాలు కూడా టిక్‌టాక్‌ను నిషేధించాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని ప్ర‌పంచానికి అంట‌గ‌ట్టారంటూ చైనాపై ప‌లు దేశాలు ఆగ్ర‌హంగా ఉన్నాయి.

ఇప్ప‌టికే కొన్ని దేశాలు చైనాతో వ్యాపార ఒప్పందాల‌ను తెగ‌దెంపులు చేసుకున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో టిక్‌టాక్ సీఈవో కెవిన్ ప‌దవికి రాజీనామా చేయ‌డం గమనార్హం.

Tags :
|
|
|

Advertisement