Advertisement

  • తన హెడ్ క్వార్టర్స్ ను చైనా వెలుపల ఉండేలా ప్లాన్ చేస్తున్న "Tiktok

తన హెడ్ క్వార్టర్స్ ను చైనా వెలుపల ఉండేలా ప్లాన్ చేస్తున్న "Tiktok

By: chandrasekar Sat, 25 July 2020 4:07 PM

తన హెడ్ క్వార్టర్స్ ను చైనా వెలుపల ఉండేలా ప్లాన్ చేస్తున్న "Tiktok


భారత్ లో బ్యాన్ ఎదుర్కొన్న టిక్ టాక్ యాప్, ప్రస్తుతం దాని మనుగడ అమెరికాలో కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ యాప్ పై కఠినమైన చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగా దీనిని USAలో త్వరలో నిషేధించవచ్చనే వార్తలు వస్తున్నాయి. షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమ్మకానికి వచ్చేసింది. అయితే Tiktok యూజర్ బేస్ అమెరికాలో చాలా ఉంది.

ఇలాంటి పరిస్థితిలో, దాని మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఈ యాప్ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతోంది. అయితే ఎలాగైనా Tiktokకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తోంది. చాలా మంది అమెరికన్ పెట్టుబడిదారులు Tiktok కొనేందుకు సిద్దంగా ఉన్నారు. Tiktok మాతృ సంస్థ అయిన బైట్‌డాన్స్‌లో మేజర్ వాటాలను ఇప్పటికే యుఎస్ కు చెందిన పెట్టుబడిదారులు కొనుగోలుచేశారు.

ఈ నేపథ్యంలో Tiktok యాప్ భవిష్యత్తు కోసం, ఏదైనా అమెరికన్ కంపెనీ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నామని బైట్‌డాన్స్ సీఈఓ కొద్దికాలం క్రితమే ఆఫర్ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ బేస్ కలిగి ఉన్న Tiktokను కొనేందుకు ఇప్పటికే అమమెరికాకు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే బైట్ డాన్స్ లో వాటాలు కలిగి ఉన్న జనరల్ అట్లాంటిక్ మరియు సీకోయా క్యాపిటల్ - బైట్ డాన్స్ నుండి Tiktok తీసుకోవటానికి ఆలోచిస్తున్నారు.

అయితే ఇప్పటికే టిక్ టాక్ తన హెడ్ క్వార్టర్స్ ను చైనా వెలుపల ఉండేలా ప్లాన్ చేస్తోంది.

ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, రెండు పెట్టుబడి సంస్థలు టేకోవర్ గురించి యుఎస్ ప్రభుత్వం, ఇతర రెగ్యులేటర్లతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఇదే జరిగితే, టిక్‌టాక్‌ను అమెరికన్ పెట్టుబడిదారులు ఎక్కువ వాటాలను కొనుగోలు చేస్తే, దాన్ని యుఎస్‌లో, నిషేధించకుండా అడ్డుకునే వీలుంది. అయితే ఇప్పటికే యుఎస్‌లో ఈ యాప్ పై చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఓటింగ్ జరుగుతోంది. చాలా మంది ప్రతినిధులు దీనిని జాతీయ రక్షణ అధికార చట్టం క్రింద నిషేధించడానికి అనుకూలంగా ఓటు వేశారు.

Tags :
|
|

Advertisement