Advertisement

హాంకాంగ్ లో టిక్ టాక్ నిలిపివేత ...

By: Sankar Tue, 07 July 2020 12:18 PM

హాంకాంగ్ లో టిక్ టాక్ నిలిపివేత ...



ఇండియా లో అత్యంత పాపులర్ అయినా యాప్ టిక్ టాక్ ..ఇండియా ద్వారా ఎంతో వ్యాపారం చేసుకున్న టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ..తాజాగా ఇండియాలో టిక్ టాక్ నిషేధించడంతో దాదాపు 6 బిలియ‌న్ డాల‌ర్ల ‌న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచనా. ఇదిలా ఉండ‌గా టిక్‌టాక్ హాంకాంగ్ మార్కెట్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది.

అయితే దీనికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది. హాంకాంగ్ స్వ‌యంప్ర‌తిప‌త్తిని కాల‌రాస్తూ చైనా పార్ల‌మెంటు ఇటీవ‌లే జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టానికి ఆమెదం తెలిపింది. దీంతో అక్క‌డ నిరస‌న‌లు భ‌గ్గుమ‌న్నాయి. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు చైనా తీరును ఎండ‌గడుతూ ఒకే తాటిపైకి వ‌స్తున్నారు. దీనిపై క‌న్నెర్ర జేసిన ప్ర‌భుత్వం హాంకాంగ్‌లో నిర‌స‌న‌ల‌ను అణిచివేసేంచుకు టిక్‌టాక్ వినియోగాన్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం టిక్‌టాక్ నిర్వాహ‌కుల‌తోనూ అక్క‌డి ప్ర‌భుత్వ అధికారులు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ త‌న‌ కార్య‌క‌లాపాల‌ను హాంకాంగ్‌లో నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ నిర్ణయానికి రాలేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యానికొచ్చిన‌ట్లు వివ‌రించింది.ఈ చ‌ర్య‌తో 1,50,000 మంది యూజ‌ర్ల‌ను టిక్‌టాక్ కోల్పోనుంది

Tags :
|

Advertisement