Advertisement

విజయవాడ దుర్గమ్మ గుడిలో టికెట్ల ధరల పెంపు...

By: chandrasekar Wed, 16 Dec 2020 3:54 PM

విజయవాడ దుర్గమ్మ గుడిలో టికెట్ల ధరల పెంపు...


విజయవాడ దుర్గమ్మ గుడిలో టికెట్ల ధరల పెంపుతో పాటూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు పంచహారతులు చూడడానికి వచ్చిన దంపతులకు రూ.500 టిక్కెట్టు ఇకపై రూ.1000కి పెంచారు. దేవస్థానం పరిధిలో భక్తులు నిర్వహించే అన్నప్రాసన, వివాహాలకు రుసుము రూ.150 నుంచి రూ.300కు పెంచారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో ఉన్న దేవస్థానం ఫిక్సెడ్‌ డిపాజిట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మార్చాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర క్యాలెండర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు, ఇరుముడి బియ్యం, ప్రొవిజన్‌స్టోర్సుకు సంబంధించిన సరకుల ధరలు, భవానీ దీక్షల విరమణకు ఏర్పాటు చేయాల్సిన షామియానాలకు అంచనాల ధరలకు ఆమోదం తెలిపారు. గుణదల క్వార్టర్స్‌లోని కమ్యునిటీ హాల్లో కార్యక్రమం నిర్వహించే దేవస్థానం ఉద్యోగులకు అద్దె రూ.10 వేలలో 25శాతం తగ్గించాలని చేసిన ప్రతిపాదన, సీవీరెడ్డి ఛారిటీస్‌లో ఏసీ, నాన్‌ ఎసీ డార్మటరీ టిక్కెట్టు ధరను పెంచాలన్న నిర్ణయాలను కమిషనర్‌ ఆమోదం కోసం ప్రతిపాదించారు.

వాటర్‌ బాటిల్స్‌, సెల్‌ఫోన్లు, క్లోక్‌ రూమ్‌, భక్తుల తలనీలాలు పోగేయడం, మల్లికార్జున మహామండపంలోని దుకాణాల లీజు పొడిగింపు అంశంపై తీర్మానం చేసి దేవాదాయశాఖ కమిషనర్‌ పరిశీలనకు పంపారు. నూతన కేశఖండన శాల నిర్మాణానికి రూ.27కోట్లు, అన్నదాన భవన నిర్మాణానికి రూ.1.97కోట్లుతో పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. సెక్యూరిటీ విభాగం, మ్యాన్‌పవర్‌ విభాగంలో రివర్స్‌ టెండర్లలో అర్హత కలిగిన సంస్థకు కాంట్రాక్టు ఇచ్చేందుకు దేవస్థానం నియమించిన కమిటీ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దసరా ఉత్సవాల సమయంలో వీఐపీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలకు అద్దె చెల్లింపును ఆమోదం తెలిపారు. షెడ్లు, విద్యుద్దీకరణ, క్యూలైను పనుల అంచనాల ధరలకు ఓకే చెప్పారు.

Tags :
|

Advertisement