Advertisement

  • చైనా వస్తువులను బహిష్కరించాలని టిబెట్ యువత నిరసన

చైనా వస్తువులను బహిష్కరించాలని టిబెట్ యువత నిరసన

By: Sankar Fri, 10 July 2020 2:47 PM

చైనా వస్తువులను బహిష్కరించాలని టిబెట్ యువత నిరసన



ప్రపంచ వ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు విమర్శలు చేస్తున్నాయి ..కరోనా వైరస్తో అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాల చేతిలో విమర్శలకు గురి అయినా చైనా , గాల్వన్ లోయలో జరిగిన సంఘటనలో ఇండియా లో కూడా విమర్శలను ఎదుర్కొంటుంది .

కాగా తాజాగా టిబెట్ కు చెందిన కొంతమంది యువత హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో చైనా కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలను వ్యక్తం చేసారు ..టిబెట్ యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. చైనా వస్తువులను తగులబెట్టారు.

టిబెట్ యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు అధ్యక్షుడు గోన్పొ ధుండప్ తెలిపారు. చైనా చోరబాట్లు, మానవ హక్కుల ఉల్లంఘనలు, కరోనా వ్యాప్తిపై తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణించారని, ఎంతో నష్టం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చినట్లు గోన్పొ తెలిపారు.

Tags :
|
|

Advertisement