Advertisement

  • క‌ష్ణా మరియు తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువ

క‌ష్ణా మరియు తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువ

By: chandrasekar Sat, 19 Sept 2020 09:26 AM

క‌ష్ణా మరియు తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువ


వాతావరణ సూచనలో భాగాంగా క‌ష్ణా మరియు తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. క‌ష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు.

ఇందువల్ల కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

పంట పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువుల, గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు. మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షితమై భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. గత కొద్ది రోజులుగా ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక, సెప్టెంబరు 20వ తేదీన ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అందువల్ల ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు.

Tags :
|

Advertisement