Advertisement

  • చిరుతపులిలా ఆస్ట్రేలియా బౌలర్లపై హర్మాన్ ప్రీత్ విరుచుకుపడి నేటికీ మూడేళ్లు ..

చిరుతపులిలా ఆస్ట్రేలియా బౌలర్లపై హర్మాన్ ప్రీత్ విరుచుకుపడి నేటికీ మూడేళ్లు ..

By: Sankar Mon, 20 July 2020 7:00 PM

చిరుతపులిలా ఆస్ట్రేలియా బౌలర్లపై హర్మాన్ ప్రీత్ విరుచుకుపడి నేటికీ మూడేళ్లు ..



మహిళల క్రికెట్ అంటే భారీ హిట్టింగ్ ఉండదు , సిక్సర్లు , ఫోరులు వంటివి ఉండవు అని చూడటానికి చాల మంది ఇష్టపడరు ..ఆస్ట్రేలియా లో బిగ్ బాష్ మహిళల టి ట్వంటీ లీగ్ వలన పవర్ హిట్టింగ్ చూస్తున్నాం గాని ఇండియాలో అయితే పవర్ హిట్టింగ్ అనేది చాల చాల తక్కువ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది ..

అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్క ఇనింగ్స్ ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఇండియాలో మహిళా క్రికెట్ స్థితిని గతిని మార్చేసింది ..మహిళా క్రికెట్ కూడా ప్రేక్షకులు చూసేలా చేసింది ఆ ఇన్నింగ్స్ ..ఆ ఇన్నింగ్స్ ఏ ఆస్ట్రేలియా మీద హర్మాన్ ప్రీత్ కౌర్ ఆడిన లో 171 పరుగుల ఇన్నింగ్స్ ..నేటితో ఆ అద్భుత ఇన్నింగ్స్ మూడేళ్లు పూర్తి చేసుకుంది ..

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు చిరస్మరణీయ రోజు. ఆసీస్‌కు వెన్నులో వణుకు పుట్టించి ఫైనల్‌కు చేరిన రోజు. ఇందులో హర్మన్‌దే ప్రధాన భూమిక. వర్షం కారణంగా కుదించిన ఆనాటి మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్‌ ప్రీత్‌ కొత్త రికార్డులు లిఖించారు. 115 బంతుల్లో 171 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 20 ఫోర్లు, 7 సిక్సర్లతో బౌండరీల మోత మోగించారు హర్మన్‌. ఈ మ్యాచ్ చివరి 10 ఓవర్లలో భారత్‌ ఏకంగా 129 పరుగులు సాధించడం విశేషం. ఆసీస్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ చెలరేగిపోయి పరుగుల వరద పారించిన ఈ పంజాబ్‌ సివంగి భారత్‌కు ఒక గొప్ప విజయాన్ని అందించారు..


Tags :
|

Advertisement