Advertisement

  • ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచ్ లలో మూడు సూపర్ ఓవర్‌లు

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచ్ లలో మూడు సూపర్ ఓవర్‌లు

By: chandrasekar Mon, 19 Oct 2020 09:52 AM

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచ్ లలో మూడు సూపర్ ఓవర్‌లు


ఆదివారం అక్టోబర్ 18 జరిగిన రెండు ఐపీల్ మ్యాచ్ లు అభిమానులను చాలా ఉత్కంఠనికి లోను చేసాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే రోజు మూడు సూపర్ ఓవర్‌లు జరిగాయి. దుబాయ్ వేదికగా ఆదివారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్‌‌లో సూపర్ ఓవర్ ఎదుర్కొన్న జట్లలో కోల్‌కతా విజయాన్ని అందుకుంది.

తరువాత రెండవ మ్యాచ్ లో దుబాయ్ వేదికగా ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగగా ఇది కూడా సూపర్ ఓవర్‌కి దారితీసింది. ఇక్కడ అనూహ్యంగా తొలి సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమమవడంతో రెండో సూపర్ ఓవర్‌ని నిర్వహించారు. చాలా అరుదైన సందర్భంగా దీనిని చెపుతున్నారు.

రెండో సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి వికెట్ నష్టానికి 11 పరుగులు చేయగా లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించేసింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఓవర్‌లో తొలి బంతినే పంజాబ్ హిట్టర్ క్రిస్‌గేల్ సిక్స్‌గా మలచగా తర్వాత బంతికి సింగిల్ వచ్చింది.

ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ అద్భుతంగా బాటింగ్ చేసి రెండు బంతుల్నీ ఫోర్‌గా మలిచేశాడు. మొత్తంగా 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే రోజు బ్యాక్ టు బ్యాక్ అదీ ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్‌లు జరగడం ఇదే తొలిసారి. చివరి వరకు ఎవరు గెలుస్తారని చాలా వేద్వేగంగా ఈ మ్యాచ్ సాగింది.

Tags :

Advertisement