Advertisement

  • ఉత్తీర్ణత మరియు తల్లిదండ్రుల మందలింపు కారణంగా ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య

ఉత్తీర్ణత మరియు తల్లిదండ్రుల మందలింపు కారణంగా ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య

By: chandrasekar Mon, 15 June 2020 3:25 PM

ఉత్తీర్ణత మరియు తల్లిదండ్రుల మందలింపు కారణంగా ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య


మానసికంగా విద్యార్థినులు అధిక వత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మరియు తల్లిదండ్రుల మందలింపు కారణంగా విద్యార్థులు బలవన్మరణాలకి పాల్పడి విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. కన్నవాళ్లకి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే వేర్వేరు ఘటనలు ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్‌ ఫెయిల్ అయ్యారన్న మనస్థాపంతో ఇద్దరు, సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించారని మనస్థాపంతో మరో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. జిల్లాలోని వేర్వేరు చోట్ల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. మద్దిపాడు మండలం మల్లవరానికి చెందిన బొడిపోగు కీర్తి ఇంటర్‌ ఫస్టియర్ చదువుతోంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కీర్తి ఉత్తీర్ణత సాధించలేకపోయింది. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అలాంటి ఘటనే నాగులుప్పలపాడు మండలంలోనూ జరిగింది.

ఆత్మ దేర్యం తక్కువ కావడంతో మండలంలోని కె.తక్కెళ్ళపాడుకు చెందిన గోసాల లుధియా అనే విద్యార్థిని ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో సమీపంలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. పామూరు మండలంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా చదవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించారని అగ్రికల్చరల్ బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పామూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దేవి ఏజీ బీఎస్సీ చదువుతోంది. లాక్‌డౌన్‌తో ఇంటి వద్దే ఉంటున్న దేవిని శ్రద్ధగా చదవడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక రోజు వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థినులు సూసైడ్ చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ విషాదాలు తల్లిదండ్రులకు తీరని భాధను కలిగిస్తావుంది.

Tags :
|

Advertisement