Advertisement

మైనర్ బాలికకు సోషల్ మీడియాలో వేధింపులు ...

By: Sankar Thu, 17 Sept 2020 12:18 PM

మైనర్ బాలికకు సోషల్ మీడియాలో వేధింపులు ...


ఆన్‌లైన్ క్లాస్ ల కోసం మైనర్ బాలికకు సెల్ ఫోన్ ఇప్పించారు పేరెంట్స్. అయితే ఆ బాలిక పేరెంట్స్ కు తెలియకుండా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసింది. ఇన్స్టా గ్రామ్ లో ఇటీవలే ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు.

ఆ బాలికకు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఆ తరువాత ఫోటోలు, టిక్‌టాక్ వీడియోలు చేశారు. ఆ తరువాత యువకులు ముగ్గురు వాటిని పేరెంట్స్‌కు పంపిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చింది. బాలిక దగ్గర నుండి ఐఫోన్ సైతం యువకులు లాక్కున్నారు.

తాము బైక్ కొనాలనుకుంటున్నామని అందుకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. చివరకు బాలిక మేనమామ పసిగట్టి పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు యువకుల్లో ఒకరు బైక్ మెకానిక్, మరొక యువకుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

పిల్లలు ఆన్‌లైన్ క్లాసులతో పాటు ఏం చేస్తున్నారో పేరెంట్స్ గమనించాలని పోలీసులు కోరుతున్నారు. సోషల్‌ మీడియాలో అకౌంట్‌ క్రియేట్ చేశారా అనేది గమనించాలని ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ లను చెక్ చేస్తుండాలని పోలీసులు చెబుతున్నారు.

Tags :
|

Advertisement