Advertisement

  • అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు

అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు

By: chandrasekar Thu, 05 Nov 2020 10:47 AM

అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్న మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు


భారత వైమానిక దళానికి మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు కొత్తగా చేరుకున్నాయి. భారతదేశ అమ్ములపొదిలో దశలవారీగా రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరుతున్నాయి. తొలి విడతలో 5 రఫేల్ విమానాలు చేరుకోగా ఇప్పుడు మరో 3 విమానాలు వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుండి భారతదేశం రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత వైమానిక దళానికి ఆయువుపట్టుగా భావిస్తున్న రఫేల్ విమానాల కోసం చాలాకాలంగా ఇండియా ఎదురుచూస్తోంది. కొద్దిరోజుల క్రితమే తొలివిడతలో భాగంగా 5 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాలోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. ఇప్పుడు మరో 3 యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి అంబాలాకు వచ్చాయి.

బుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అంబాలా ఎయిర్ బేస్ పై ఈ 3 రఫేల్ యుద్ధవిమానాలు ల్యాండ్ అయ్యాయి. ఈ సందర్బంగా ఎయిర్ బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి అంబాలాకు చేరాయి. ఏడు వేల కిలోమీట‌ర్ల సుదీర్ఘ దూరం ప్ర‌యాణించిన రఫేల్ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ పై సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన ద‌సాల్డ్ కంపెనీ నుండి 36 యుద్ధ విమానాలను భార‌త్ కొనుగోలుచేసింది. దీనికోసం 60 వేల కోట్ల‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో 30 రఫేల్ యుద్ధవిమానాలు, ఆరు ట్రైనీ విమానాలున్నాయి. రెండుదశల్లో ఇప్పటివరకూ 8 విమానాలు ఇండియాకు చేరాయి. రఫేల్ యుద్ధవిమానాలతో భారత రక్షణ రంగం మరింతగా బలోపేతమైంది. చైనా తో సరిహద్దు వివాదం వేళ ఇవి భారత్ కు చేరడం వల్ల మరింత బలం చేకూరినట్లు అయింది.

Tags :
|

Advertisement