Advertisement

  • 'థ్యాంక్యూ' చిత్రంలో నాగ చైతన్య సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు

'థ్యాంక్యూ' చిత్రంలో నాగ చైతన్య సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు

By: chandrasekar Thu, 05 Nov 2020 10:34 AM

'థ్యాంక్యూ' చిత్రంలో నాగ చైతన్య సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు


కరోనా వల్ల చిత్ర నిర్మాణం అన్ని చోట్ల నిలిపివేయబడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే షూటింగులు మొదలు పెడుతున్నారు. మనం సినిమా తరువాత అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ మరో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసింది. హెల్లో, 24 చిత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ ఈ కొత్త సినిమాకు థ్యాంక్యూ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. డిసెంబర్ నుంచి థ్యాంక్యూ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మన్మథుడు 2 కథానాయిక అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీలో మరో కథానాయికగా నటించనుందని ప్రస్తుత సమాచారం.

కానీ థ్యాంక్యూ సినిమాలో కథానాయికలు గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. మరోవైపు గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుల్ మోహన్ ఈ మూవీలో మరో హీరోయిన్ గా సందడి చేయనుందని సమాచారం. ప్రస్తుతం మూడో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోందని తెలుస్తోంది. విక్రమ్ కే కుమార్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తోన్న థ్యాంక్యూ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టి 2021 దితీయార్థంలో సినిమాను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ మూవీనీ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా తెరక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. మరి మూడో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారో.

Tags :

Advertisement