Advertisement

  • ప్రజలు చూస్తుండగానే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటాము ..అమెరికా మాజీ అధ్య‌క్షులు

ప్రజలు చూస్తుండగానే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటాము ..అమెరికా మాజీ అధ్య‌క్షులు

By: Sankar Fri, 04 Dec 2020 10:22 PM

ప్రజలు చూస్తుండగానే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటాము ..అమెరికా మాజీ అధ్య‌క్షులు


క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప‌బ్లిగ్గా వేసుకుంటామ‌ని ముగ్గురు అమెరికా మాజీ అధ్య‌క్షులు ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచ‌డానికి వాళ్లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఓ టీవీ షోలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే నేను ప‌బ్లిగ్గా దానిని వేసుకుంటాను అని ప్ర‌క‌టించారు. టీవీలో ప్ర‌త్యక్షంగా చూపిస్తున్న‌పుడు లేదా వీడియో రికార్డ్ చేస్తూ అయినా తాను వ్యాక్సిన్ వేసుకుంటానని ఆయ‌న చెప్పారు.

నేను ఈ సైన్స్‌ను న‌మ్ముతాన‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డానికే ఈ ప‌ని చేస్తాను అని అన్నారు. త్వ‌ర‌లోనే అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్.. ఫైజ‌ర్‌, మోడెర్నాల‌కు చెందిన వ్యాక్సిన్‌ల‌ను వినియోగానికి అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఒబామా ఈ వ్యాఖ్య‌లు చేశారు

Tags :
|
|

Advertisement