Advertisement

  • చిరుత‌పులి మాంసం విక్ర‌యిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్

చిరుత‌పులి మాంసం విక్ర‌యిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్

By: chandrasekar Sat, 26 Sept 2020 09:25 AM

చిరుత‌పులి మాంసం విక్ర‌యిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్


చిరుత‌పులి మాంసం విక్ర‌యిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉబ్బ‌సం వ్యాధి నివార‌ణ‌కు మందుగా పేర్కొంటూ చిరుత‌పులి మాంసం విక్ర‌యిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను కొలొంబోలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న శ్రీ‌లంక‌లో శుక్ర‌వారం చోటుచేసుకుంది.

ఇక్కడ సెంట్ర‌ల్ హైలాండ్స్‌లో చిరుత‌పులిని వేటాడిన‌ట్లుగా స‌మాచారం అందుకున్న పోలీసులు వారి ఇండ్ల‌పై రైడ్ చేసి ప‌ట్టుకున్నారు. గురువార‌మే వీరు అడ‌విలో వ‌ల‌ప‌న్నీ చిరుత‌ను ప‌ట్టుకున్నారు. త‌ల న‌రికేసి అడ‌విలోనే పారేశారు.

చిరుతపులి చ‌ర్మం, మాంసం, ఇత‌ర శ‌రీర భాగాల‌ను విక్ర‌యించేందుకు ముక్క‌లుగా కోసి తీసుకొచ్చారు. చిరుత మాంసం ఉబ్బ‌సం వ్యాధిని న‌యం చేస్తుంద‌నేది స్థానికంగా ప్ర‌చారంలో ఉంది. ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల వ‌ద్ద నుంచి 17 కిలోల చిరుత మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. జంతు సంర‌క్ష‌ణ చ‌ట్టం ప్ర‌కారం దోషుల‌కు ఐదేళ్ల జైలు శిక్ష ప‌డ‌నుంది.

Tags :
|

Advertisement