Advertisement

బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడుకు బెదిరింపులు...

By: chandrasekar Wed, 16 Dec 2020 3:57 PM

బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడుకు బెదిరింపులు...


పాత కక్షలతో ఓ యువకుడు తమను వేధిస్తున్నాడని బిగ్ బాస్ ఫేం నూతన్‌నాయుడు దంపతులు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం నూతననాయుడు తన భార్యతో కలిసి విశాఖ నుంచి హైదరాబాద్‌ కారులో వెళ్తుండగా తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన జి.భవానీశంకర్‌ వీరు వెళ్తున్న కారును వెంబడించి నామవరం దగ్గర అడ్డగించి గతంలో జరిగిన కేసుల విషయమై తన వద్ద వీడియోలు ఉన్నాయని, అవి బయట పెట్టకుండా ఉండాలంటే రూ.10 లక్షలు నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, తమను చంపేస్తానని బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు.

నూతననాయుడు తన భార్యతో కలిసి విశాఖ నుంచి హైదరాబాద్‌ కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నూతన్ ఇంట్లో పనిచేసే కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు చెప్పకుండా పని మానేశాడట. దాంతో ఆ యువకుడికి శిరోముండనం చేసారు. శుక్రవారం రోజు ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్‌ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేశారని జుట్టు తొలగించారు. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు. నూతన్ నాయుడు దంపతులు శిరోముండనం కేసులు అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags :
|

Advertisement