Advertisement

  • ప్లే స్టోర్ లో బగ్ కారణంగా ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ముప్పు

ప్లే స్టోర్ లో బగ్ కారణంగా ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ముప్పు

By: chandrasekar Tue, 08 Dec 2020 08:31 AM

ప్లే స్టోర్ లో బగ్ కారణంగా ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ముప్పు


కొంతకాలంగా ఆండ్రాయిడ్ ఫోన్ లలో యూసర్ డేటా ను చోరీ చేసి మోసగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కానీ గూగుల్ ప్లే స్టోర్‌లోని ప్ర‌ముఖ డేటింగ్‌, ట్రావెల్‌, వీడియో కాలింగ్ యాప్స్ CVE-2020-8913 అనే బ‌గ్ బారిన ప‌డుతున్నాయ‌ని చెక్ పాయింట్ సంస్థ‌లోని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ బ‌గ్‌తో హానిక‌ర‌మైన కోడ్ల‌ను యాప్స్‌లో ప్ర‌వేశ‌పెట్టి, వ్య‌క్తిగ‌త స‌మాచారం చోరీ చేయ‌డం లేదా యూజ‌ర్ల‌పై నిఘా వేయ‌డం చేస్తున్న‌ట్లు చెక్ పాయింట్ వెల్ల‌డించింది. ఈ బ‌గ్ వ‌ల్ల ఇప్ప‌టికె కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ముప్పు పొంచి ఉంద‌ని ఆ సంస్థ చెబుతోంది.

అసలు గూగుల్ ఈ బ‌గ్‌ను గ‌త ఏప్రిల్‌లోనే స‌రి చేసింది. కానీ తీవ్ర‌త విష‌యంలో దీనికి 10కి 8.8 రేటింగ్ ఇచ్చింది. అయితే చాలా మంది యాప్ డెవ‌ల‌ప‌ర్లు ఇప్ప‌టికీ పాత‌బ‌డిపోయిన గూగుల్ కోర్ లైబ్ర‌రీ (జీపీసీ)నే వాడుతున్నారు. ఇందులోనే ఈ బ‌గ్‌ను క‌నుగొన్నారు. ఈ జీపీసీ ద్వారానే డెవ‌ల‌ప‌ర్లు త‌మ అప్‌డేట్స్‌ను యూజ‌ర్ల‌కు చేర‌వేస్తారు. గత సెప్టెంబ‌ర్‌లో గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని ప్ర‌ముఖ యాప్స్‌ను చెక్ పాయింట్ పరీక్షించింది. ఇందులో 13 శాతం డెవ‌ల‌ప‌ర్లు జీపీసీనే వాడుతున్న‌ట్లు గుర్తించింది.

ప్రస్తుతం 8 శాతం మంది బ‌గ్ ముప్పు ఎక్కువ‌గా ఉన్న వెర్ష‌న్‌నే వాడుతున్నార‌ని ఇందులో తేలింది. Bumble, OkCupid, Grindr, Microsoft Edge, Cisco Teams, Viber లాంటి ప్ర‌ముఖ యాప్స్‌ను చెక్ పాయింట్ ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించింది. ఈ బ‌గ్ ముప్పు గురించి ముందుగా ఈ యాప్స్ డెవ‌ల‌ప‌ర్స్‌కు చెక్ పాయింట్ స‌మాచారం ఇచ్చింది. ఈ బ‌గ్ యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారంతోపాటు సున్నిత‌మైన బ్యాంక్ వివ‌రాలు, సోష‌ల్ మీడియాపై నిఘా వేయ‌డంలాంటివి కూడా చేస్తున్న‌ట్లు చెక్ పాయింట్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇందువల్ల యూజర్లకు హానికలిగించే కోడ్లను ఇందులో చేర్చి యూసర్ డాటాను చోరీ చేయగలరు.

Tags :
|
|

Advertisement