Advertisement

ఈసారి ఇంట్లోనే ఆషాడ బోనం ..

By: Sankar Fri, 26 June 2020 3:13 PM

ఈసారి ఇంట్లోనే ఆషాడ బోనం ..



ఆషాడ మాసం వచ్చింది అంటే తెలంగాణాలో పండగ వాతావరణం నెలకొంటుంది ..ఒకవైపు వర్షాలతో పొలం పనులు సాగుతుంటే మరోవైపు ఆషాడ మాసంలో బోనాల పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ..అయితే ప్రతి సంవత్సరం అత్యంత అద్భుతంగా జరిగే ఆషాడ మాస బోనాలు ఈ సారి మాత్రం కరోనా వలన సందడి తగ్గాయి ..హైద్రాబాద్లో అతి పెద్ద పండగ అయినప్పటికీ కరోనా హైదరాబాద్లో విస్తరించిన తీరును చూస్తే ఈ సారి బోనాలు పండగ చేయకపోవడమే మంచిది అనిపిస్తుంది ..ప్రభుత్వం కూడా ఈ సారి పండగను ఇంటికే పరిమితం చేసుకోవాలి అని చెప్పడంతో ప్రజలు కూడా నిరాశలో ఉన్నారు ..

విస్తారంగా కురిసే వర్షాలతో ఈ మాసంలో కలరా, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులు మనుషులపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఇలా వ్యాధులు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గ్రామదేవతలను వేడుకొని భక్తులు బోనాలు సమర్పిస్తారు. బోనాల సందర్భంగా మహిళలు కాళ్లకు రాసుకునే పసుపుతో వానాకాలంలో అరికాళ్లు చెడకుండా ఉంటాయి. దీంతో పాటు ఈ పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మానికి, వీధి వీధికి వేపాకు మండలు కడతారు. వేపాకులో ఉండే ఔషధగుణం ద్వారా క్రిమికీటకాలు నాశనం అవడంతో పాటు అంటువ్యాధులు దరికి చేరవు.

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆషాఢ బోనంకు కరోనా గ్రహణం పట్టింది. దీంతో బోనాల పండుగను ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాధి కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదే. ఎల్లమ్మ అనుగ్రహంతో కరోనా వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ..

Tags :
|
|

Advertisement