Advertisement

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులారా...ఈ వార్త మీకోసమే.

By: chandrasekar Mon, 30 Nov 2020 2:01 PM

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులారా...ఈ వార్త మీకోసమే.


మీకు సేవింగ్ ఎకౌంట్ పోస్టాఫిస్‌లో ఉంటే..ఇక నుంచి పోస్టాఫిస్ సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఇండియా పోస్ట్ పోస్టాఫిప్ సేవింగ్స్ బ్యాంక్‌లో సేవింగ్ ఎకౌంట్ లిమిట్ పెంచారు. కొత్త నియమం అనేది డిసెంబర్ 12వ తేదీ నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన ఇండియన్ పోస్టాఫిస్ ట్విటర్‌లో ఒక పోస్ట్ చేసింది. డిసెంబర్ 11,2020 వరకు తమ ఖాతాలో మినిమం రూ.500 డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీ పోస్టాఫిస్ సేవింగ్ ఖాతాలో మీరు డిసెంబర్ 11 వరకు రూ.500 మెయింటేన్ చేయపోతే మీకు ఎకౌంట్ మెయింటెనెన్స్ చార్జీలను కట్ చేస్తారు. జీరో బ్యాలెన్స్ అయితే ఎకౌంట్ క్లోజ్ అయిపోతుంది. పోస్టాఫిజ్‌లో మీరు జాయింట్ ఎకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పెద్దల నుంచి మైనర్ వరకు ఖాతా తెరుచుకోవచ్చు. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న మైనర్లు ఖాతా పొందే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఒక ఎకౌంట్ మాత్రమే తెరవవచ్చు. ఎవరైనా పోస్టాఫిస్‌లో ఖాతా తెరిస్తే వారికి 4 శాతం వడ్డీ కల్పిస్తారు. ప్రతీ నెల 10వ తేదీన ఖాతాలో 500 ఉండాల్సిందే.

Tags :
|
|
|

Advertisement