Advertisement

  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటి‌సారి...

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటి‌సారి...

By: chandrasekar Mon, 07 Dec 2020 2:40 PM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటి‌సారి...


దేశంలో గత కొన్నిరోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పెట్రో ధరలు రెండేండ్ల గరిష్టానికి చేరాయి. నిన్న లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 29 చొప్పున పెంచిన కంపెనీలు, తాజాగా పెట్రోల్‌పై 30-33, డీజిల్‌పై 25-31 పైసలు పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.83.41 నుంచి రూ.83.71కి చేరింది. అలాగే డీజిల్‌ ధర రూ.73.62 నుంచి 73.87కి పెరి‌గింది. 2018 సెప్టెం‌బర్‌ తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటి‌సారి.

చమురు ధరలు గత నెల 20వ తేదీ నుంచి 14 సార్లు పెరిగాయి. దీంతో గత 18 రోజుల్లో పెట్రోల్‌ లీటరు ధర రూ.2.65, డీజిల్‌ ధర లీటరు రూ.3.40 పెరి‌గింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధమైన పెట్రోల్‌, డిజిల్‌పై పన్నులు వసూలు చేస్తుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. దీంతో ముంబైలో పెట్రోల్‌ ధర రూ.90.34, డీజిల్‌ ధర రూ.80.51, కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.85.19, డీజిల్‌ ధర రూ.77.44, చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.86.51, డీజిల్‌ ధర రూ.79.21, బెంగళూరులో పెట్రోల్‌ రూ.86.51, డీజిల్‌ రూ.78.31,హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.87.06, డీజిల్‌ ధర రూ.80.32గా ఉ౦ది.

Tags :
|

Advertisement