Advertisement

  • ఇది అమెరికన్ల విజయం ...విజయోత్సవ సభలో జో బిడెన్ వ్యాఖ్యలు

ఇది అమెరికన్ల విజయం ...విజయోత్సవ సభలో జో బిడెన్ వ్యాఖ్యలు

By: Sankar Sun, 08 Nov 2020 09:21 AM

ఇది అమెరికన్ల విజయం ...విజయోత్సవ సభలో జో బిడెన్ వ్యాఖ్యలు


అమెరికా 46 వ అధ్యక్షుడిగా డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే ..ఈ విజయంతో ప్రజలు ట్రంప్ నాలుగేళ్ళ పాలనకు స్వస్తి పలికి మార్పు కోరుకున్నారని స్పష్టంగా అర్ధం అయింది...ట్రంప్ పాలనలో అంతగా సంతృప్తి చెందని అమెరికన్లు జో బిడెన్ వైపు మొగ్గు చూపారు ..అందుకే అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అత్యధిక వోటింగ్ నమోదు అయింది...

అయితే ఈ విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవసభలో కీలక విషయాలను ప్రస్తావించారు బైడెన్... నా గెలుపు అమెరికన్ల విజయంగా అభివర్ణించిన ఆయన.. అమెరికన్లు భవిష్యత్తు కోసం ఓటు వేశారని ప్రకటించారు.. మనం పూర్తి ఆధిక్యంతో గెలిచాం.. అమెరికా చరిత్రలో ఇదో రికార్డుగా పేర్కొన్నారు జో బైడెన్...

ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటేశారని.. వారి విశ్వాసాన్ని నిలబెడుతూ, దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు జో బైడెన్‌.. అధ్యక్ష ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్‌ అద్భుతమైన నాయకురాలని కొనియాడిన ఆయన.. తమ గెలుపు అమెరికన్ల విజయంగా అభివర్ణించారు.

డెలావెర్‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవసభలో ఉద్వేగంగా ప్రసంగించారు బైడెన్.. అధ్యక్ష స్థానం వరకు చేరుకున్న తన జీవితంలో సహకరించిన జీవిత భాగస్వామి జిల్‌ బైడెన్‌ సహా ఇతర కుటుంబ సభ్యులపై ఈ సందర్భంగా బైడెన్‌ ప్రశంసలు కురిపించారు. ఇక, ఈ ఎన్నికల్లో ఓడిపోయినా డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు శత్రువేమీ కాదన్నారు బైడెన్.. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు..

Tags :

Advertisement