Advertisement

ఈ తరానికి నా ఆట నచ్చదు..రాహుల్ ద్రావిడ్

By: Sankar Tue, 09 June 2020 9:06 PM

ఈ తరానికి నా ఆట నచ్చదు..రాహుల్ ద్రావిడ్

భారత్ మాజీ క్రికెటర్లలో రాహుల్ ద్రావిడ్‌కు ఎంతో గొప్ప పేరుంది. టెస్టు మ్యాచుల్లో అయితే ఇక ప్రత్యర్థుల సహనాన్ని పరిశీలించడంలో ద్రావిడ్ సాటి మరొకరు లేరు. అందుకే అభిమానులంతా ముద్దుగా అతడిని ‘ది వాల్’ అని పిలుచుకుంటారు. అయితే ప్రస్తుత ఆటగాళ్లతో ద్రావిడ్‌ను పోలిస్తే అతడి స్థానం ఎక్కడ ఉంటుంది..? ఈ ప్రశ్నకు రాహులే ఇటీవల సమాధానం చెప్పారు.

ప్రస్తుత తరానికి తన బ్యాటింగ్‌ అంతగా పనికిరాదని చెప్పారు. ‘నా బ్యాటింగ్‌తో ఎక్కువకాలం నెట్టుకురాలేకపోయేవాడినేమో. ఇప్పుడు ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ చూడండి. అప్పట్లో సచిన్, సెహ్వాగ్‌ల స్ట్రైక్ రేట్ కంటే నాది తక్కువగా ఉండేది. కానీ అప్పట్లో అదే గొప్ప. కానీ ఇప్పుడలా కాదు. భారీగా ఆడగలగాలి. అన్ని రకాల గేర్లలో బ్యాటింగ్ చేయగలగాలి. నేను అలా చేయలేను’ అని రాహుల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత తరంలో రోహిత్, కోహ్లీలు భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్నారని ద్రావిడ్ ప్రశంశించారు.

ఇదిలా ఉంటే రాహుల్ ద్రావిడ్ తన కెరీర్‌లో మొత్తంగా 24,000 పరుగులు చేశారు. అందులో 48 సెంచరీలు, 146 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ద్రావిడ్ స్ట్రైక్ రేట్ 42.51గా ఉండగా వన్‌డేల్లో మాత్రం 71.23తో మెరుగ్గా ఉన్నారు.


Tags :
|

Advertisement