Advertisement

  • రిగ్గింగ్ చేయడం వల్లనే బిడెన్ గెలిచాడు ...డోనాల్డ్ ట్రంప్

రిగ్గింగ్ చేయడం వల్లనే బిడెన్ గెలిచాడు ...డోనాల్డ్ ట్రంప్

By: Sankar Mon, 16 Nov 2020 07:02 AM

రిగ్గింగ్ చేయడం వల్లనే బిడెన్ గెలిచాడు ...డోనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3 వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. డెమోక్రాట్ అభ్యర్ధీ జో బైడెన్ అధ్యక్ష పదవిలో విజయం సాధించాడు.

అయితే, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తన ఓటమిని ఇప్పటి వరకు అంగీకరించలేదు. తాను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓటమిని ఒప్పుకోనని ట్రంప్ మరోసారి ట్వీట్ చేశాడు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం ద్వారా జో బైడెన్ విజయం సాధించారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఫెడరల్ ఏజెన్సీ, జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ లు జో గెలుపును ఇంకా అంగీకరించలేదని ట్రంప్ వాడుతున్నాడు. తమ లీగల్ టీమ్ న్యాయపోరాటం చేస్తుందని, తప్పకుండా తనదే విజయం అని ట్రంప్ వాదిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఈ విషయంపై డెమోక్రాట్, రిపబ్లికన్ మద్దతుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

Tags :

Advertisement