Advertisement

'ఇది హైదరాబాదీ లవ్ అంటే' అని సోనూ సూద్ ట్వీట్...

By: chandrasekar Mon, 30 Nov 2020 11:18 PM

'ఇది హైదరాబాదీ లవ్ అంటే' అని సోనూ సూద్ ట్వీట్...


కరోనా వల్ల చాలా మంది తమ జీవనోపాధిని కోల్పోయి కష్టాలు పడుతుంటే అలంటి వారందరికీ సోనూ సూద్ ఎంతో సహాయం చేశారు. అందువల్ల అయనపైన ప్రజల్లో అభిమానం పెరిగింది. మాములుగా ప్రజలు ఎవరిపైనా అంత ఈజీగా అభిమానం పెంచుకోరు. ఒక్కసారి ఎవరిపై అయినా అభిమానం పెంచుకుంటే చచ్చే వరకు వదిలిపెట్టరు సర్ మా తెలుగు వాళ్లు అంత ఎమోషనల్ ఫూల్స్ అంటూ ఠాగూర్ సినిమాలో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు సోనూ సూద్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. గతేడాది వరకు ఈయన నటుడు మాత్రమే కానీ ఇప్పుడు నటుడు అనేది చిన్న పదం అయిపోతుంది. ఈయన మానవతా మూర్తి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చాలా మంది దేవుడు అంటూ అయన చేసిన సేవలకు పొగిడేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఆ తర్వాత సోనూ సూద్ చేసిన మంచి పనుల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. ఎక్కడ కష్టం అన్న పదం వినిపిస్తే అక్కడ సోనూ సూద్ అనే పేరు కూడా వినిపించేలా ఈయన సాయం చేసాడు. కోట్లకు కోట్లు ఆపదలో వున్న వారికి సహాయం చేసి ఈయన ఖర్చు చేసాడు.

అడిగిన మరియు అడగని ప్రతి మనిషికి సోనూ సూద్ సహాయం చేశారు. మనిషి మనిషికి సాయం చేయకపోతే ఇంకెందుకు దండగ అని వాళ్ల అమ్మగారు చెప్పిన మాటలను గుర్తు పెట్టుకుని ఇప్పటికే కొన్ని వేల మందికి సోనూ సాయం చేసాడు. దాదాపు 20 వేల మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్స్‌లో సొంతూళ్లకు పంపించాడు సోనూ సూద్. అలాగే కొందరు అనారోగ్యానికి గురైతే 20 లక్షలు, 10 లక్షలు ఇలా ఇచ్చేసి వాళ్ల ప్రాణాలు నిలబెట్టాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు. గతంలో కూడా సోనూ సూద్ చాలా సార్లు హైదరాబాద్ వచ్చాడు కానీ అప్పుడు చూడని ప్రేమ ఇప్పుడు ఈయన చూస్తున్నాడు. దానికి కారణం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో సోనూ సూద్ నటిస్తున్నాడు. మెగాస్టార్ సినిమాలో షూటింగ్ కోసం ఈయన ఇక్కడకు చేరుకున్నారు.

సినిమా షూటింగ్ కోసం ఇక్కడ చేరుకున్న ఇతనిని చూడటానికి జనాలు వచ్చారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. సోనూ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు అతడి క్యారీవాన్ దగ్గరికి వచ్చి సోనూ సూద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అప్పుడు బయటికి వచ్చిన సోనూ సూద్ తన కోసం వచ్చిన వాళ్లతో మాట్లాడారు. వాళ్ల అభిమానం చూసి సోను పొంగిపోయాడు. 'ఇది హైదరాబాదీ లవ్ అంటే' అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. ఈయన ఆచార్య సెట్‌లో అడుగుపెట్టిన వెంటనే తణికెళ్ల భరణి, కొరటాల శివ అతనిని సత్కరించారు. అల్లుడు అదుర్స్ సెట్‌లో కూడా ప్రకాశ్ రాజ్ ఈయన్ని సత్కరించాడు. ఏదేమైనా కూడా ఇప్పుడు సోనూ సూద్ సినిమాలలో విలన్ ఏమో కానీ రియల్ లైఫ్‌లో మాత్రం హీరోనే. ఈయన చేస్తున్న సహాయాన్నీ ప్రజలందరూ కొనియాడుతున్నారు.

Tags :

Advertisement