Advertisement

కేరళలో డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్

By: Sankar Sun, 05 July 2020 11:22 AM

కేరళలో డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్



కేరళలో తగ్గుముఖం పట్టింది అనుకున్న కరోనా మళ్ళీ విరుచుకుపడుతుంది ..తాజాగా జొమాటో లో డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు ..డెలివరి బాయ్ అంటే చాల మందితో లైవ్ కాంటాక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అతడితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు ..కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురంలో ఒక్కరోజే ఓ మెడికల్ రిప్రజెంటేటివ్, ఓ పోలీసు అధికారికి కరోనా సోకింది. 24 గంటల్లో 240 కరోనా కేసులు వెలుగుచూడటంతో తిరువనంతపురంలో హైఅలర్ట్ ప్రకటించారు.

తిరువనంతపురం నగర శివార్లలోని పలయం మార్కెట్ సమీపంలోని లాడ్జీలో నివాసముంటున్న జోమాటో డెలివరీ బాయ్ కు కొవిడ్ లక్షణాలు కనిపించడంతో అతన్ని పరీక్షించారు. డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ అని రావడంతో అతన్ని ఐసోలేషన్ చేశారు. కజాకొట్టాం ప్రాంతంలోని పలు ఆసుపత్రులను సందర్శించిన 27 ఏళ్ల మెడికల్ రిప్రజెంటేటివ్ కు కరోనా సోకిందని తేలడంతో ఆయా ఆసుపత్రుల్లో వారు కలవరపడ్డారు. తిరువనంతపురం సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారికి కూడా కరోనా సోకింది. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు.

Tags :
|
|
|

Advertisement