Advertisement

  • కరోనా బారిన పడిన తిరుపతి ఎమ్యెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

కరోనా బారిన పడిన తిరుపతి ఎమ్యెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

By: Sankar Wed, 26 Aug 2020 12:13 PM

కరోనా బారిన పడిన తిరుపతి ఎమ్యెల్యే భూమన కరుణాకర్ రెడ్డి


తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు..

ఆ సమయంలో అయన మాట్లాడుతూ ఆసుపత్రిలో నుంచి మృతదేహాలను బయటికి తీయడం, అంబులెన్స్‌లో ఎక్కించడం, కుటుంబ సభ్యులకు అప్పగించడం, దహన సంస్కారం చేసే వారంతా మనుషులే కదా అని అన్నారు. వారికి లేని భయం ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఉండటం సరికాదని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను తిరుపతిలో కరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొంటున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. మార్గదర్శకాలు, తగిన జాగ్రత్తలతో కోవిడ్‌ మృతులకు కూడా అంత్యక్రియలు జరుపుకోవచ్చని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు..

Tags :
|
|
|

Advertisement