Advertisement

  • తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు

By: Sankar Fri, 11 Dec 2020 10:15 AM

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 25  నుంచి జనవరి 3 వరకు


తిరుమల తిరుపతి ..ఈ పేరు వింటే చాలు హిందూ భక్తుల మదిలో పులకింత కలుగుతుంది ..దేశంలోనే అత్యంత గొప్ప పుణ్య క్షేత్రాలలో తిరుమల ఒకటి ...అయితే కరోనా కారణంగా ఈ ఏడాది అంతగా భక్తులు దర్శనం చేసుకోలేదు ..అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏడాది పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు. ఇవి ఈనెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. ప్రతి రోజు 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువ‌మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం చేసుకోవాడానికి అనువుగా శ్రీవారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని ప‌ది రోజుల పాటు తెర‌చి ఉంచాల‌ని టీటీడీ నిర్ణయించింది. దీంతో డిసెంబ‌ర్‌ 25న వైకుంఠ ఏకాద‌శి కావడంతో ఆరోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భ‌క్తుల‌కు ద‌ర్శనభాగ్యం క‌ల్పిస్తారు.

Tags :

Advertisement