Advertisement

  • చరిత్రలో తొలిసారి..ఏకాంతంగా కలియుగ దేవుడి బ్రహ్మోత్సవాలు

చరిత్రలో తొలిసారి..ఏకాంతంగా కలియుగ దేవుడి బ్రహ్మోత్సవాలు

By: Sankar Fri, 18 Sept 2020 1:51 PM

చరిత్రలో తొలిసారి..ఏకాంతంగా కలియుగ దేవుడి బ్రహ్మోత్సవాలు


కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరా స్వామి బ్రహ్మోత్సవాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూసేవారు..ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలు చూడటానికి వస్తారు..అయితే ఈ ఏడాది కరోనా కారణంగా జనరద్దీని కట్టడి చేసేందుకు తిరుమల–తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే నిర్వహించాలని తలపెట్టింది. కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది.

దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ. దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రంలో ఈ సారి ఏకాంతగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి అని చరిత్రకారులు చెబుతున్నారు.

అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి పట్టువ్రస్తాలను శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

మరోవైపు జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బ్రహ్మోత్సవాల రద్దీ నేపథ్యంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి భావించింది. ప్రజల జీవన స్థితిగతులు, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయించింది. ఈ సారి బ్రహ్మోత్సవాలను కోవిడ్‌–19 నిబంధనలకనుగుణంగా నిర్వహించాలని భావించింది.

Tags :
|

Advertisement