Advertisement

  • రైలులో ప్రయాణించేటప్పుడు పాటించవలసిన విషయాలు

రైలులో ప్రయాణించేటప్పుడు పాటించవలసిన విషయాలు

By: chandrasekar Sat, 23 May 2020 12:17 PM

రైలులో ప్రయాణించేటప్పుడు పాటించవలసిన విషయాలు


రైళ్లు జూన్ 1 నుండి ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం రెండువందల రైళ్లు నడవబోతున్నట్లు రైల్వే శాఖా తెలిపింది. ఏ ట్రైన్‌లోనూ జనరల్ బోగీలు ఉండబోవని స్పష్టం చేసింది. గతంలో ఉన్న ఛార్జీలనే వసూలు చేస్తామని, ప్రయాణీకులందరికీ సీట్లు లభించేలా చూస్తామని, అంతకు మించిన రద్దీ ఉంటే ప్రయాణికులకు అనుమతి ఉండదని తెలిపింది.

రైల్వే స్టేషన్ లలో టికెట్ బుకింగ్ సెంటర్ లలో అమ్మకాలు ఉండవు. ఒక నెల ముందు మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునే వీలుంటుంది. టికెట్ బుకింగ్స్ కు గరిష్ట కాలపరిమితి 30 రోజులు మాత్రమే. కన్ఫార్మ్ టికెట్ లు ఉన్న వారికి మాత్రమే రైల్వే స్టేషన్ లోకి అనుమతి ఉంటుంది. రైళ్లలో కి ప్రవేశించే ముందు ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేశారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేనివారికే రైలు ప్రయాణానికి అనుమతిస్తారు.

ఇక వికలాంగుల కు నాలుగు కేటగిరీల కింద, దీర్ఘకాలిక వ్యాధులతో భాధపడే వారికి 11 కేటగిరీల కింద టికెట్ల ధరలలో రాయితీ ఇస్తారు. ప్రయాణికులు తమ స్వస్థలాలకు చేరిన తర్వాత ఆయా రాష్ట్రాలు విధించే నిబంధనలు పాటించాలి. ఈ రైళ్లలో ఎటువంటి దుప్పట్లు, బ్లాంకెట్లు సరఫరా చేయబోమని రైల్వే శాఖ ప్రకటించింది.


Tags :
|
|
|

Advertisement