Advertisement

శ్రీశైలంలో మరో వారం రోజులు దర్శనాలు లేవు

By: chandrasekar Wed, 22 July 2020 4:51 PM

శ్రీశైలంలో మరో వారం రోజులు దర్శనాలు లేవు


శ్రీశైలం ఆలయంలో కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా మరో వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు వెల్లడించారు.

కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఆలయంలో యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు, పరోక్ష సేవలను కొనసాగిస్తామని వివరించారు.

ఆలయ సిబ్బందికి కరోనా సోకగా ఈ నెల 15 నుంచి ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు.

ముందుగా వారం రోజులే ఆలయంలో దర్శనాలను ఉండవని ప్రకటించినప్పటికీ కరోనాను కట్టడి చేసేందుకు మరో వారం పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో చెప్పారు.

Tags :
|

Advertisement